సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతి... మహనీయుడికి ఘన నివాళులు

2చూసినవారు
సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతి... మహనీయుడికి ఘన నివాళులు
హుస్నాబాద్ ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రజల హక్కుల కోసం, అణగారిన వర్గాల కోసం పోరాడిన మహావీరుడు, బహుజన రాజ్యస్థాపకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. పాపన్న గౌడ్ సామాన్య ప్రజల కోసం, ముఖ్యంగా అణగారిన వర్గాల కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన మహానుభావుడని, ఆయన స్థాపించిన బహుజన రాజ్యం స్వరాజ్య భావన, సమానత్వం కోసం చేసిన పోరాటం నేటి తరాలకు మార్గదర్శకమని మంత్రి అన్నారు. పాపన్న గౌడ్ ధైర్యసాహసాలు, నాయకత్వ గుణాలు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్