
బడ్జెట్ 2026లో రవాణా రంగంలో విప్లవం దిశగా నిర్ణయం
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026లో రవాణా రంగంలో విప్లవాత్మక నిర్ణయాలు ప్రకటించారు. పర్యావరణహితమైన, తక్కువ ఖర్చుతో కూడిన సరుకు రవాణాను ప్రోత్సహించేందుకు తూర్పు భారతదేశంలోని దన్కుణి (పశ్చిమ బెంగాల్) నుండి పశ్చిమ తీరంలోని సూరత్ (గుజరాత్) వరకు 'డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్' ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ కారిడార్ ద్వారా పారిశ్రామిక కేంద్రాల మధ్య సరుకు రవాణా వేగవంతం కావడమే కాకుండా, లాజిస్టిక్స్ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని ఆమె పేర్కొన్నారు.




