హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గౌడ కుటుంబ సభ్యులు తమ ఇంటి వద్ద నుండి అమ్మవారికి బోనం తీసుకొని ఊరేగింపుగా ఏడంతరాల బోనం ఎత్తుకొని నృత్యాలు చేస్తూ తల్లికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి గౌడ సంఘం నాయకులు, కుటుంబ సభ్యులు, కుల బాంధవులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.