తానా ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రశంసలు

161చూసినవారు
తానా ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రశంసలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో జరిగిన బాలసాహిత్య భేరి అంతర్జాతీయ అంతర్జాల వేదికలో గేయం, పద్యం విభాగాల్లో పాల్గొన్న హవేళి ఘణపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు గొల్ల నవ్య, సంగేపు కీర్తన, నుల్క అర్పిత, అదీబా, బర్ల నవదీప్ లకు తానా ప్రశంస పత్రాలు అందజేశారు. ప్రధానోపాధ్యాయులు ఆడేపు కరుణాకర్ విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ, వారికి విలువైన పుస్తకాలు చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్