అత్యధికంగా ట్రిపుల్ ఐటీ సీట్లు సాధించిన విద్యార్థులు

0చూసినవారు
అత్యధికంగా ట్రిపుల్ ఐటీ సీట్లు సాధించిన విద్యార్థులు
ఇటీవల ప్రకటించిన బాసర ట్రిపుల్ ఐటీ సీట్లలో సిద్ధిపేట జిల్లా కోహెడ మండలంలోని శనిగరం ఉన్నత పాఠశాలకు చెందిన 15 మంది విద్యార్థులు సీట్లు సాధించారు. జిల్లాలోనే అత్యధిక ట్రిపుల్ ఐటీ సీట్లు సాధించిన పాఠశాలగా ఇది నిలిచింది. పాఠశాల చరిత్రలో ఇదే తొలిసారి. గ్రామ సర్పంచ్ లింగంపల్లి లక్ష్మయ్య విద్యార్థులకు, ప్రధానోపాధ్యాయురాలికి, ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్