హుస్నాబాద్ పట్టణంలో కొందరు వ్యాపారస్తులు చక్కెరను బ్లాక్ చేసి వినియోగదారులకు కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సమీప దూరంలో పండుగలు ఉన్న పరిస్థితులను ఆసరా చేసుకుని కొందరి అధికారుల అండదండలతో చక్కెర సప్లై చేసే డీలర్లు వారి యొక్క గోదాములలో నిలువ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇట్టి విషయంలో ఆర్డీవో యుద్ధ ప్రాతిపదికన వారి యొక్క నిలువ ప్రాంతాలలో దాడులు జరిపి చర్యలు తీసుకోవాలని బిఎస్పి పార్టీ పక్షాన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్ డిమాండ్ చేశారు.