సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి గాజు వంతెనను ఎల్లమ్మ చెరువులో నిర్మిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో రూ. 18 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ తెలిపారు. అత్యాధునిక సాంకేతికతతో నిర్మిస్తున్న ఈ వంతెనను త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇది హుస్నాబాద్ ప్రాంతంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో చేపట్టిన సరికొత్త ఆవిష్కరణ.