అమ్మవారికి నిలువెత్తు బంగారం మొక్కులు చెల్లించుకున్న మంత్రి

0చూసినవారు
హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని భీమదేవరపల్లి మండలం ములకనూరులో గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్ సమ్మక్క, సారలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. స్థానిక నాయకులు సమ్మక్క సారలమ్మల జాతరను ఘనంగా నిర్వహిస్తున్నారని, లక్షలాది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :