నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఎమ్మెలలతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ప్రజల సంక్షేమం, సౌకర్యాల విస్తరణకు ముఖ్యమైన మౌలిక వసతుల అభివృద్ధికి ఈ పర్యటన దిశానిర్దేశకంగా నిలవనుందన్నారు. ఆరోగ్య, పరిపాలనా, రవాణా, సాంకేతిక రంగాలలో శాశ్వత మార్పులకు బాటలు వేసే అనేక కార్యక్రమాలకు శంకుస్థాపన చేశామన్నారు.