ప్రమాదాలు జరగకుండా రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి

562చూసినవారు
హుస్నాబాద్ ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం రవాణా శాఖ అధికారులతో జూమ్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస ప్రమాదాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇరుకు రోడ్లు, డివైడర్లు లేకపోవడం ప్రమాదాలకు కారణమవుతున్నాయని, వాహనాల స్పీడ్ లాక్ అమలును పర్యవేక్షించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే ట్రిపుల్ పెనాల్టీ విధించాలని ఆయన సూచించారు. ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్