సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్ మున్సిపాలిటీలో శనివారం వీరనారి చాకలి ఐలమ్మకు ఘనంగా నివాళులు అర్పించారు. నిజాం నిరంకుశ పాలనను ప్రశ్నించి, ఎదిరించిన ఆమె ధైర్యసాహసాలను మహిళలు,
విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని, వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాలపై పోరాడాలని బిఎస్పి పార్టీ పక్షాన పచ్చిమట్ల రవీందర్ గౌడ్ పిలుపునిచ్చారు.