హుస్నాబాద్ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పెండింగ్, పూర్తయిన పనులపై సమీక్ష నిర్వహించారు. సీసీ రోడ్లు, కమ్యూనిటీ భవనాలు, ఎల్లమ్మ చెరువు సుందరీకరణ, మొక్కల పెంపకం వంటి అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. పెండింగ్ పనుల ఆలస్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, సీసీ రోడ్ల పనులను ఈ నెలాఖరులోగా, ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులను మార్చిలోగా పూర్తి చేయాలని సూచించారు.