హుస్నాబాద్ ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాము: మంత్రి

2చూసినవారు
హుస్నాబాద్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జిల్లెలగడ్డ అటవీ ప్రాంతంలో అర్బన్ ఫారెస్ట్ పార్కు పనులకు శంకుస్థాపన చేసిన ఆయన, నాలుగు జిల్లాల మధ్యలో ఉన్న హుస్నాబాద్‌ను అభివృద్ధి చేస్తే హైదరాబాద్ నుంచి పర్యాటకులు వస్తారని తెలిపారు. ఉమ్మాపూర్లో మహాసముద్రం, సర్వాయి పాపన్న కోటలు, కాలభైరవ క్షేత్రం, రాయికల్ వాటర్ పాల్స్ ఉన్నాయని, గుట్టల సమీపం నుంచే జాతీయ రహదారి ఉండటం వల్ల పర్యాటకులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్