తన ఇల్లు ఇప్పించాలంటూ మహిళ ఆవేదన
అక్కన్నపేట మండలం చౌటకుంట తండాకు చెందిన భూక్య పద్మ తన ఇంటిని తనకు అప్పగించి న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నారు. తన ఇంటి పక్కన నివసించే వారు ఇంటిని కబ్జా చేసి, ఇంటి ముందు సామాన్లు పెట్టారని ఆమె ఆరోపించారు. ఈ విషయంపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఇంటి ముందు ఉన్న సామాన్లను మాత్రమే తొలగించారని తెలిపారు. తన ఇంటికి మరమ్మతులు చేసుకునేందుకు జేసీబీ తీసుకువస్తే అడ్డుకుంటూ కొట్టేందుకు వస్తున్నారని, చంపుతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికి సంబంధించిన ఇంటి పత్రాలు ఉన్నాయని, పక్కింటి వారు కూడా తమదేనని చెబుతున్నారని తెలిపారు. ఒకవేళ తాము కొనుగోలు చేసినట్లయితే సంబంధిత పత్రాలు అధికారులకు చూపెట్టాలని అన్నారు.