
కంటి అద్దాలు అవసరమైన వారికి... కంటి అద్దాలు ఇప్పిస్తా: మంత్రి
సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆర్వీఎం హాస్పిటల్ మెగా హెల్త్ క్యాంప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్య పరీక్షల కోసం వచ్చిన వారితో మాట్లాడి, అవసరమైన చికిత్స హైదరాబాద్ లో చేయిస్తామని, కంటి అద్దాలు అవసరమైన వారికి స్వయంగా ఇప్పిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.







































