
హుస్నాబాద్: శబరిమలై యాత్ర బయలుదేరిన అయ్యప్పస్వాములు
సిద్ధిపేట జిల్లా కోహెడ మండలంలోని తంగళ్ళపల్లి శ్రీవేణుగోపాలస్వామి దేవస్థానంలో అయ్యప్ప స్వామి మండల దీక్షను పూర్తి చేసుకున్న అయ్యప్పస్వాములు గురువారం శబరి యాత్రకు బయలుదేరి వెళ్ళారు. గురు స్వామి శ్రీ శేషం నరసింహచార్యులు చేతుల మీదుగా ఇరుముళ్ళు కట్టుకుని, అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని ప్రార్థించారు.






































