
సిద్దిపేట కొత్త సీపీగా రేష్మి పెరుమాళ్ బాధ్యతలు స్వీకరిస్తారు
సిద్దిపేట నూతన పోలీస్ కమిషనర్ గా రేష్మి పెరుమాళ్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత సీపీ విజయ్ కుమార్ ను ఎస్పీ జాయింట్ సీపీగా బదిలీ చేశారు. విజయ్ కుమార్ సిద్దిపేట సీపీగా ఉన్న సమయంలో జిల్లాలో బెల్ట్ షాపులు, అక్రమ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయడంతో పాటు, స్థానిక సర్పంచ్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించి గుర్తింపు పొందారు. రేష్మి పెరుమాళ్ అతి త్వరలోనే నూతన సీపీగా బాధ్యతలు స్వీకరించనున్నారని సమాచారం.








































