పొడిచంపల్లి తండా సమీపంలో ప్రమాదం.. వ్యక్తికీ గాయాలు

371చూసినవారు
పాపన్నపేట మండలం పొడిచంపల్లి తండా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శేరిపల్లి గ్రామానికి చెందిన రాములు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న అతడిని బొలెరో వాహనం ఢీకొట్టడంతో రోడ్డుపై పడిపోయాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, 108 సిబ్బందితో కలిసి ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్