మెదక్–చేగుంట రహదారిపై ప్రమాదం

471చూసినవారు
చిన్న శంకరంపేట మండలం గువ్వలపల్లి చౌరస్తా సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మెదక్ నుంచి చేగుంట వైపు వెళ్తున్న కారును అతివేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొనడంతో కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే 108 అత్యవసర సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వ్యక్తిని మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్