యూటర్న్‌ల వద్ద ప్రమాదాలు.. మూసివేయాలని ప్రజల విజ్ఞప్తి!

6చూసినవారు
యూటర్న్‌ల వద్ద ప్రమాదాలు.. మూసివేయాలని ప్రజల విజ్ఞప్తి!
యూటర్న్‌ల వద్ద వరుస ప్రమాదాలతో డీజీ-765 రహదారి ప్రమాదకరంగా మారింది. నిజాంపేట మండల కేంద్రం మీదుగా వెళ్లే ఈ రహదారిపై వారం రోజుల్లో రెండు యూటర్న్‌ ప్రమాదాలు చోటుచేసుకోగా. ఒకరికి తీవ్ర గాయాలు, మరొకరు మృతి చెందారు. యూటర్న్‌ల వద్ద వాహనాలు ఒక్కసారిగా మలుపు తిరగడం, ఎదురుగా వచ్చే వాహనాలు అతివేగంగా రావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అవసరం లేని యూటర్న్‌లను మూసివేసి, ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతోపాటు వేగ నియంత్రణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్