చిన్నశంకరంపేటలో బైక్ ప్రమాదం.. ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు

1293చూసినవారు
చిన్నశంకరంపేట మండల కేంద్రంలో శ్రీనివాస ఫంక్షన్ హాల్ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో సూరారం గ్రామానికి చెందిన అనిల్, వినీల్ అనే ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది, బాధితులకు ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్