మెదక్ సమీపంలోని పసుపులేరు బ్రిడ్జి కింద గుర్తుతెలియని సుమారు 65 ఏళ్ల వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. ఎండ తీవ్రత, ఆహారం లేకపోవడంతో రెండు రోజుల క్రితమే మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతుడి గుర్తింపునకు పోలీసులు ప్రజల సహకారం కోరుతున్నారు.