అడవి పందుల దాడితో మొక్కజొన్న పంట నాశనం

12చూసినవారు
అడవి పందుల దాడితో మొక్కజొన్న పంట నాశనం
చేతికొచ్చిన మొక్కజొన్న పంటను అడవి పందులు ధ్వంసం చేయడంతో రైతు తీవ్రంగా నష్టపోయాడు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్‌ కొమ్మాట సత్యనారాయణ తన ఎకరం పొలంలో సాగు చేసిన మొక్కజొన్న పంటను పందులు పూర్తిగా నాశనం చేశాయి. కోతకు వచ్చే సమయంలో పొలంలోకి చొరబడి పంటను తొక్కి ధ్వంసం చేశాయని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. అడవి పందుల బెడదతో ఏటా రైతులు నష్టపోతున్నారని, అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం పరిహారం అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్