వెంచర్ యజమానులతో వివాదం.. వ్యక్తి మృతి కలకలం
నార్సింగి మండలం భీమ్రావుపల్లి గ్రామ పరిధిలోని త్రిపుర వెంచర్‌లో లకావత్ రాజు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. వెంచర్ యజమానులతో ఆర్థిక వ్యవహారాల వివాదాల కారణంగా తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
