మెదక్ జిల్లా నిజాంపేట గ్రామపంచాయతీ నిర్వహణ, పారిశుధ్యంపై అధికారులు దృష్టిసారించారు. ఇందులో భాగంగా మండలంలోని కల్వకుంట గ్రామపంచాయతీని డీఎల్‌పీవో యాదయ్య మంగళవారం తనిఖీ చేశారు. స్మశానవాటిక, నర్సరీ, డంపింగ్ యార్డుతోపాటు పంచాయతీ రికార్డులను పరిశీలించారు. పంచాయతీ సిబ్బంది, కార్యదర్శికి పలు సూచనలు చేస్తూ. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి రజినీకాంత్‌రెడ్డి, గ్రామ కార్యదర్శి సంతోష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.