రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

3చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి
సైకిల్‌పై రోడ్డు దాటుతున్న వృద్ధుడిని కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలై మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా నిజాంపేటలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. నిజాంపేటకు చెందిన నాలం రాజగౌడ్‌ (71) తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ ఎదురుగా ఉన్న యూటర్న్‌ వద్ద సైకిల్‌పై రోడ్డు దాటుతుండగా రామాయంపేట నుంచి సిద్దిపేట వైపు వెళ్తున్న TG-27-9338 నంబరు గల స్విఫ్ట్‌ కారు వేగంగా, అజాగ్రత్తగా వచ్చి ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన రాజగౌడ్‌ను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై శ్రీనివాస్‌ తెలిపారు.

సంబంధిత పోస్ట్