మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నత్నాయిపల్లి గ్రామంలో ఆదివారం గొల్ల మల్లేశం (34) అనే రైతు బోరు మోటార్ చెక్ చేస్తూ విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. తన తమ్ముడు, మరో కౌలు రైతుతో కలిసి పొలానికి నీరు పెట్టడానికి వెళ్ళిన అతను మోటార్ స్టార్ట్ కాకపోవడంతో ట్రాన్స్ఫార్మర్ వద్ద వైర్ ను సరిచేస్తుండగా ప్రమాదం జరిగింది. బైక్ పై అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదులో ఎలాంటి అనుమానం లేదని పేర్కొన్నాడు.