మెదక్: సర్పంచ్ పదవికి తండ్రీకొడుకుల మధ్య పోటీ

11చూసినవారు
మెదక్: సర్పంచ్ పదవికి తండ్రీకొడుకుల మధ్య పోటీ
మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ గ్రామంలో సర్పంచ్ పదవికి తండ్రీకొడుకుల మధ్య పోటీ నెలకొంది. తండ్రి మానెగళ్ళ రామకృష్ణయ్య, కొడుకు వెంకటేష్ ఇద్దరూ సర్పంచ్ స్థానానికి నామినేషన్లు దాఖలు చేశారు. 1563 మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామంలో మొత్తం 10 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ అనూహ్య పరిణామం స్థానికంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

సంబంధిత పోస్ట్