మెదక్: చీరకు నిప్పంటుకుని వివాహిత మృతి

2చూసినవారు
మెదక్: చీరకు నిప్పంటుకుని వివాహిత మృతి
చిన్నశంకరంపేట మండలంలోని చందంపేట గ్రామానికి చెందిన రొడ్డ గౌతమి (32) ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకోవడంతో తీవ్రంగా గాయపడింది. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించినప్పటికీ, పరిస్థితి విషమించి మంగళవారం ఆమె మృతి చెందింది. ఐదేళ్ల క్రితం భర్తను రోడ్డు ప్రమాదంలో కోల్పోయిన గౌతమి, ఒంటరిగా కూతురిని పోషిస్తోంది. తల్లి మృతితో 13 ఏళ్ల కుమార్తె శరణ్య అనాథగా మారింది. గ్రామ సర్పంచ్, బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి, బాలిక భవిష్యత్తుకు భరోసా కల్పించాలని కోరారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్