మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ ముత్తాయికోట శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు బుధవారం తన కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర కార్తీక మాస పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు గోవింద్ మహారాజ్ ఆధ్వర్యంలో గణపతి పూజ, సిద్దేశ్వర స్వామివారికి పంచామృత అభిషేకం, అలంకరణ, మహా మంగళహారతి వంటి కార్యక్రమాలు జరిగాయి. అనంతరం ఆలయ మర్యాదలతో ఎస్పీకి తీర్థ ప్రసాదాలు అందజేశారు.