రామాయంపేటలో బుధవారం ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్‌తో 16 ఏళ్ల బాలుడు షేక్ షాబుద్దీన్ మృతి చెందాడు. కోనాపూర్ తురకకాశ తండాకు చెందిన షాబుద్దీన్, రామాయంపేటలోని ఎస్సార్ పామ్ వాటర్ సర్వీసింగ్ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. పనిలో ఉండగా కరెంట్ షాక్‌కు గురై కుప్పకూలిపోవడంతో, ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వాటర్ సర్వీసింగ్ సెంటర్ యజమాని నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.