ఉమ్మడి మెదక్ జిల్లాలో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల పనితీరుపై రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పెండింగ్ రెవెన్యూ సమస్యలు, ధరణి దరఖాస్తుల పరిష్కారం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంటి అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు.