మెదక్ మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యులుగా
కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం ఎదుట జరిగిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు కార్యకర్తలతో కలిసి స్టెప్పులేసి ఉత్సాహాన్ని నింపారు. పార్టీ గెలుపును పురస్కరించుకుని
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.