ఈదురుగాలులకు ఎగిరిపోయిన రేకులు

858చూసినవారు
ఆవంచ గ్రామంలో భారీ వర్షం, ఈదురుగాలుల కారణంగా ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి, ఒక వేపచెట్టు ఇంటిపై ఒరిగింది. గ్రామస్తులు భయాందోళనకు గురైనా ప్రాణనష్టం జరగలేదు. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న వడ్లు వర్షానికి తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.