బాల్య వివాహాలకు చందంపేటలో సంచలన తీర్మానం

307చూసినవారు
బాల్య వివాహాలకు చందంపేటలో సంచలన తీర్మానం
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని చందంపేట గ్రామస్థులు బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టాలని సంచలన తీర్మానం చేశారు. సర్పంచ్ నాయిని ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో, అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 21 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేస్తామని, నిబంధనలు ఉల్లంఘించబోమని గ్రామస్థులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సామాజిక నిర్ణయాన్ని ఎంపీడీవో దామోదర్ అభినందించారు. చందంపేట నిర్ణయం ఇతర గ్రామాలకు స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు.

సంబంధిత పోస్ట్