మెదక్: అత్యంత కిరాతకంగా అన్నను చంపిన తమ్ముడు

567చూసినవారు
మెదక్ జిల్లాలో దారుణ హత్య చోటు చేసుకుంది. కుల్చారం మండలం వసురాం తండాలో అన్నను అత్యంత కిరాతంగా తమ్ముడు హత్య చేశాడు. తండా సమీపంలోని కల్లు దుకాణం వద్ద అన్న మంగ్యను తమ్ముడు మోహన్ హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్