స్తంభాన్ని ఢీకొన్న ట్రాక్టర్.. తప్పిన ప్రమాదం

0చూసినవారు
స్తంభాన్ని ఢీకొన్న ట్రాక్టర్.. తప్పిన ప్రమాదం
శనివారం చిలిప్ చేడ్ మండల పరిధిలోని గంగారం గ్రామ శివారులో ధాన్యాన్ని రైస్ మిల్లుకు తరలిస్తుండగా ఒక ట్రాక్టర్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో స్తంభం విరిగిపోయినప్పటికీ, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఫైజాబాద్ గ్రామానికి చెందిన రైతు రమేష్ తన ట్రాక్టర్‌లో ధాన్యాన్ని సిరిపుర గ్రామంలోని రైస్మిల్లుకు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానిక ఎస్సై నర్సింహులుకు ఈ విషయంపై ఇంకా సమాచారం అందలేదని తెలిపారు.

సంబంధిత పోస్ట్