వెంకటరావుపేటలో విషాదం.. విద్యుత్ షాక్‌కు రైతు బలి

441చూసినవారు
వెంకటరావుపేటలో విషాదం.. విద్యుత్ షాక్‌కు రైతు బలి
కౌడిపల్లి మండలం వెంకటరావుపేటలో రైతు నీలం లక్ష్మీనారాయణ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను స్థానికులు గుర్తించి 108కు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న సిబ్బంది ఆయన అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్