వెల్దుర్తి : విద్యుత్ షాక్ తగిలి చికిత్స పొందుతూ ఓ రైతు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని
కుకునూరు గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు గ్యారెల్ల పోచయ్య (50) ఈనెల 27న తన వ్యవసాయ పొలం వద్ద బోరు మోటారు పనిచేయకపోవడంతో ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ సరఫరా కోసం ప్రయత్నాలు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలింది. గాయపడిన ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ గురువారం ఆయన మృతి చెందారు. మృతుడికి భార్య పోచమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. వారి వివాహాలు ఇప్పటికే జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. రైతు పోచయ్య మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.