Nov 09, 2025, 18:11 IST/
VIDEO: పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి
Nov 09, 2025, 18:11 IST
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదివారం చిత్తూరు జిల్లాలోని ముసలిమడుగులో పర్యటించారు. ఈ క్రమంలో అక్కడ అపశృతి చోటు చేసుకుంది. పర్యటన ముగించుకొని హెలిప్యాడ్ దగ్గరకు వెళ్తుండగా ఆయన్ను చూడటానికి ఒక్కసారిగా స్థానికులు కాన్వాయ్ ముందుకు వచ్చారు. దీంతో ఓ మహిళ కింద పడడటంతో.. ఆమె కాలుపై పవన్ వాహనం వెళ్ళింది. వెంటనే భద్రతా సిబ్బంది ఆమెను బయటకు లాగి, చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.