
అదృష్టం అంటే ఇదే.. లాటరీలో ఒకే వ్యక్తికి మూడు మద్యం దుకాణాలు
తెలంగాణలో ఇవాళ కొత్త మద్యం దుకాణాలకు లక్కీ డ్రా ద్వారా లైసెన్సులను కేటాయిస్తున్నారు. తాజాగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. ఏకంగా లక్కీ డ్రాలో మూడు మద్యం షాపులను దక్కించుకున్నారు. సంగారెడ్డి పట్టణానికి చెందిన రాజేశ్వర్ గౌడ్ అతని సిండికేట్ మొత్తం 24 షాపులకు టెండర్లు వేయగా.. వారికి ఏకంగా మూడు వైన్స్ షాపులు లాటరీ ద్వారా దక్కాయి. అలాగే నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన నరసింహ గౌడ్, దిలీప్ గౌడ్, ప్రభు గౌడ్ ల సిండికేట్ కూడా మూడు షాపులు దక్కించుకుంది.





































