కర్ణాటక రాష్ట్రం హోలి కోడ్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మృతులు నారాయణఖేడ్ మండలం జగన్నాథపూర్ గ్రామానికి చెందిన కాశీనాథ్ (60), రాచప్ప (45), మరియు నవీన్ (40) గా గుర్తించారు. దత్తాత్రేయ స్వామి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.