సంగారెడ్డి: విషాదం.. ఉరేసుకుని నర్సు ఆత్మహత్య

8చూసినవారు
సంగారెడ్డి: విషాదం.. ఉరేసుకుని నర్సు ఆత్మహత్య
హైదరాబాద్‌లోని మియాపూర్‌లో నర్స్ మేఘావత్ సోను భాయ్(20) ఆత్మహత్య చేసుకుంది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన సోను భాయ్ మియాపూర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. హాస్టల్‌లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గత ఏడాది కాలంగా ఒక యువకుడితో ప్రేమలో ఉన్న ఆమె.. ప్రేమ విఫలమవడంతో సూసైడ్ చేసుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మియాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్