మెదక్: బస్సు ప్రమాదం.. 10 మంది పరిస్థితి విషమం

2903చూసినవారు
కొల్చారం మండలం జైన మందిరం వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సు, లారీ ఢీకొని 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందిన వెంటనే 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్