మద్యం మత్తులో ఎమర్జెన్సీ డ్రామా

33చూసినవారు
నర్సాపూర్ మున్సిపాలిటీలోని సీతారాంపూర్ కాలనీలో మంగళవారం, పరుశురాం (37) అనే వ్యక్తి మద్యం సేవించి, ఛాతినొప్పిగా ఉందని అత్యవసర సేవలకు ఫోన్ చేశాడు. దీంతో రెండు అంబులెన్సులు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సిబ్బంది అతన్ని పరిశీలించగా, అతను మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. ఎటువంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకుని, అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో కాలనీలో కొద్దిసేపు కలకలం రేగింది. అధికారులు అనవసర సమయాల్లో అత్యవసర సేవలను దుర్వినియోగం చేయవద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్