వెల్దుర్తి మండలం దామరంచ గ్రామంలో అగ్నిప్రమాదం సంభవించి, రైతు నాచారం మహేష్‌కు చెందిన 40 బస్తాలకు పైగా వరి ధాన్యం పూర్తిగా కాలిపోయింది. అడవి ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు పెట్టిన నిప్పు గాలికి వ్యాపించి ధాన్యం కుప్పకు అంటుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. మంటలను ఆర్పేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.