మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామ శివారులోని MLR ఆటో పరిశ్రమలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట్లు సమాచారం. ఎండ తీవ్రతతో మంటలు వ్యాపించి, పరిశ్రమ ప్రాంగణంలో నిల్వ ఉన్న ఆటోలు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.