మూడు గంటల్లోనే దొంగల ఆటకట్టు.. నగదు స్వాధీనం

713చూసినవారు
నర్సాపూర్‌లో జరిగిన రూ. 2.66 లక్షల నగదు చోరీ కేసును పోలీసులు కేవలం 3 గంటల్లోనే ఛేదించారు. షాడో ఫ్యాక్స్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి బంధువు, అతని స్నేహితుడు కలిసి కార్యాలయం వెనుక నుంచి చొరబడి నగదును అపహరించినట్లు గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చోరీకి ఉపయోగించిన స్కూటీతో పాటు సీసీ కెమెరా డీవీఆర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రంగకృష్ణ మంగళవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్