చండూరు శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో చిలిపిచేడ్‌కు చెందిన శాతరి పరశురాం (25) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తన సోదరితో కలిసి బైక్‌పై వెళ్తుండగా కారు ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది. తీవ్రంగా గాయపడిన సోదరిని జోగిపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పెళ్లికి ముందు జరగాల్సిన పసుపు వేడుక రోజునే ఈ ప్రమాదం చోటుచేసుకోవడం, పెళ్లికూతురి రెండు కాళ్లు విరగడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.