మాసాయిపేటలోని 44వ జాతీయ రహదారిపై జరిగిన దారుణ ఘటనలో గుర్తు తెలియని వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం తర్వాత కూడా వాహనాలు అతివేగంగా వెళ్లడంతో మృతదేహం గుర్తుపట్టలేని స్థితికి చేరుకుంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి, మృతుడి వివరాలు తెలియరావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.